కేసీఆర్‌కు ఇచ్చిన సిట్ నోటీసులు చెల్లవు

కేసీఆర్‌కు ఇచ్చిన సిట్ నోటీసులు చెల్లవు

రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ న్యాయ బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ న్యాయ బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నోటీసులు చట్టబద్ధంగా చెల్లవని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. మోహిత్ రావు తన అధికారిక ప్రకటనలో చట్టంలోని కీలక అంశాలను ప్రస్తావించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 (CRPC-160) ప్రకారం.. వయస్సు, ఇతర ఆరోగ్య కారణాల దృష్ట్యా కొన్ని వర్గాల వ్యక్తులకు నోటీసులు ఇవ్వడంపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. కేసీఆర్ విషయంలో ఈ నిబంధనలను సిట్ తుంగలో తొక్కిందని, చట్టాన్ని అతిక్రమించి నోటీసులు ఇవ్వడం చెల్లదని ఆయన పేర్కొన్నారు. ఏళ్ల తరబడి విచారణ పేరుతో వేధిస్తామంటే కుదరదని.. ఇలాంటి రాజకీయ కక్షసాధింపు కేసులను గతంలో సుప్రీంకోర్టు వందల సంఖ్యలో కొట్టేసిందన్నారు. ఈ నోటీసులపై తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

రాజకీయ వేడి.. న్యాయ పోరాటం
ఈ కేసులో తాజాగా నేరుగా గులాబీ బాస్ కేసీఆర్‌కు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. న్యాయపరంగా ఈ నోటీసులను ఎదుర్కోవడమే కాకుండా, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న 'కక్షసాధింపు' రాజకీయాలను ఎండగడతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పలువురు అధికారుల అరెస్టులతో సాగిన ఈ కేసు, ఇప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతోంది. 

Read More డా. వేదాల శ్రీనివాస్ కు  విఎంపి  భారత గౌరవ పురస్కారం