విద్యుత్ సమస్యలపై ప్రత్యేక చర్యలు
విశ్వంభర, అంబర్ పేట : బస్తిబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ గోల్నాక సెక్షన్ అధికారులు, సిబ్బంది మంగళవారం న్యూ అంబేద్కర్ నగర్ బస్తిని సందర్శించి స్థానిక విద్యుత్ సమస్యలపై తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు. ప్రధానంగా లో వోల్టేజి, కరెంట్ సరఫరాలో ఉండే అంతరాయాలను తొలగించడంలో కార్యాచరణ జరిగింది. కార్యక్రమంలో సెక్షన్ ఏఈ కే. భాస్కర్, ఎఫ్ఎం కేకే రాజు, ఎల్ఐ ప్రవీణ్ కుమార్, ఎల్ ఎంలు వేణుగోపాల్ రెడ్డి, వెంకన్న నాయక్, రాంప్రసాద్, లక్ పతి, జేఎల్ఎం వినోద్ కుమార్, ఆర్టీషన్లు నరేష్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది పాత సమస్యలను పరిశీలించి, అవసరమైన మార్పులు, కరెంట్ సరఫరా సరిచేసి, లో వోల్టేజి సమస్యలను పరిష్కరించారు. స్థానికవాసుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్‌ను కూడా తీసుకుని, భవిష్యత్‌లో సమస్యలు రాకుండా నిరంతర పర్యవేక్షణను కొనసాగిస్తారని అధికారులు తెలిపారు.



