అనాథాశ్రమాలకు బియ్యం వితరణ

అనాథాశ్రమాలకు బియ్యం వితరణ

విశ్వంభర,నెల్లికుదురు: పరోపకారి, సామాజిక సేవకులు హెచ్చు అఖిల్ జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని దివ్య కృప ట్రస్ట్ కు చెందిన 25 మంది అనాధ పిల్లలకు, పెద్ద ముప్పారం లోని అమ్మ ఒడి వృద్ధాశ్రమానికి బియ్యం,  వంట తదితర సామాగ్రి వితరణ చేశారు. మండల కేంద్రం నెల్లికుదురు లోని హెచ్చు రేణుక శంకర్ దంపతుల కుమారుడు అఖిల్ జన్మదినాన్ని పురస్కరించుకొని తన స్నేహితులు ఫోక్ సింగర్, జానపద కళాకారుడు పసునూరి జంపయ్య, ఇసంపెల్లి జాని తో కలిసి సంబంధిత సామాగ్రిని అంద చేశారు. గత 10 సం.ల నుంచి సోషల్ వర్కర్ గా హైదరాబాదులో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఎంతోమంది అనాధ బాల, బాలికలకు చేయూతనిస్తున్నాడు. సూరారం ప్రాంతంలోని పలు అనాధాశ్రమాలలో పలుసార్లు అనాధ బాల,బాలికలకు,వృద్ధులకు భోజనాలు సమకూర్చాడు. కొందరు బాలికలను సొంత ఖర్చులతో చదివిస్తున్నాడు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ, మానవసేవే మాధవసేవ గా భావించి సేవ చేయడంలోనే ఆత్మసంతృప్తి పొందుతున్నానన్నాడు. సేవ చేయడం కర్తవ్యం గా భావిస్తున్నట్లు చెప్పాడు.

Tags: