పుల్లూరులో ఆరోగ్య శిబిరం

పుల్లూరులో ఆరోగ్య శిబిరం

విశ్వంభర, సిద్దిపేట: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషాలిటీ డాక్టర్లచే మంగళవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 6రకాలైన జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, స్త్రీ వైద్య, కంటి వైద్య, దంత, పిల్లల డాక్టర్లు రోగులను పరీక్షించారు. పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి గ్రామస్తులు భారీగా హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ ధన్‌రాజ్ ఆకస్మాత్తుగా తనిఖీచేసి వైద్య సేవలను పర్యవేక్షించారు. ప్రోగ్రాం ఆఫీసర్ ఎన్సీడీ డాక్టర్ వినోద్ బాబ్జీ బీపీ, షుగర్ రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంత్ లత, సీహెచ్‌వో లక్ష్మి, సూపర్‌వైజర్ శాంత, పీహెచ్‌ఎన్ ప్రభలత, సీనియర్ అసిస్టెంట్ సాధిక్, పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: