పందెం కోడి విరిగిన రెక్కకు శస్త్ర చికిత్స 

పందెం కోడి విరిగిన రెక్కకు శస్త్ర చికిత్స 

 విశ్వంభర, కోదాడ: మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన పందెం కోడి యజమాని మొన్న తన కోడి పుంజును బరిలో దింపగా అవతలి కోడిపుంజు విసిరిన కత్తి దెబ్బకి కోడి పుంజు భుజం ఎముక ( రెక్క ఎముక)  తెగి రెండుగా విడిపోయింది .  అసలే కోళ్ళంటే పిచ్చి, అందులోనూ పౌరుషాలకు ప్రతిరూపమైన పందెం కోడి అంటే మహాపిచ్చితో  కోడి పుంజును  ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో వైద్యంకోసం  నిన్న మేళ్లచెర్వు వెళ్లగా  కోడిపుంజును కోదాడ తీసుకువెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. కోసుకొని తినే కోడే కదా అన్న చిన్న చూపు లేకుండా తనకు నచ్చిన ప్రాణానికి ఎలాగైనా తిరిగి రెక్కను అందించాలనే పెద్ద మనస్తో యజమాని కోడిపుంజుని కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకు వచ్చారు. రెక్క విరిగిన కోడి పుంజును పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య,  బొక్క విరిగి రెండు రోజులు కావడం తో తెగిన కండ, బొక్కలు ఇన్ఫెక్షన్ సోకి ఉండగా , గాయాలను శుభ్రపరచి రక్త ప్రసరణ జరిగేలా చేసి  ఆర్థోపెడిక్ సర్జరీ ద్వారా విరిగిన ఎముకలను రాడ్ వేసి అతికించి, గాయాన్ని కుట్లతో మూసి వేసి విజయవంతంగా  శస్త్ర చికిత్స పూర్తిచేశారు. అనంతరం అంతవరకూ రెక్క వేలాడేసి తిరిగిన కోడి రాడ్ వేశాక రెక్కను ఆడిస్తూ నిటారుగా లేచి తిరగడం తో యజమాని సంతోషం వ్యక్తం చేశారు. చికిత్సలో సిబ్బంది రాజు, చంద్రకళ తదితరులు  పాల్గొన్నారు.

Tags: