20న కామ్రేడ్ ఠానూ నాయక్ వర్ధంతి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న కామ్రేడ్ ఠానూ నాయక్ 77వ వర్ధంతి సభలు జరగనున్నాయి. తెలంగాణ గిరిజన సంఘం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర నాయకులు మంగళవారం వర్ధంతి పోస్టర్‌ను విడుదల చేశారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ఎం ధర్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినయ్ కుమార్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నాయకులు భూపతి వెంకటేశ్వర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. 1950 మార్చి 20న భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరమరణం పొందిన ఠానూ నాయక్ చరిత్రను భావితరాలకు తెలియజేయడం ఈ సభ ఉద్దేశ్యం. హైదరాబాదులో మూడు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు రాష్ట్ర గిరిజన సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొంటారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలు నాయక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నాయకులు ఎం గోపీ నాయక్, రఘు నాయక్, శివ ప్రచండ నాయక్ పాల్గొన్నారు.



