నూతన పాలక మండలికి సన్మానం
విశ్వంభర, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివానందం, వైస్ చైర్మన్ రాజశేఖర్ డైరెక్టర్ లు హమీద్,సందీప్ లను మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలరాజు, చిన్న ముదిరాజ్, సందీప్ లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ బాలరాజు మాట్లాడుతూ.. నూతన పాలక మండలి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రైతులకు మార్కెట్ యార్డులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.మార్కెట్ కార్యకలాపాల్లో పారదర్శకతను పాటిస్తూ, రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కృషి చేయాలన్నారు.నియోజకవర్గంలోని రైతుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



