తలకు తగిలే గాయాలను నిర్లక్ష్యం చేయొద్దు
- న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్
విశ్వంభర, శంషాబాద్: తలకు తగిలే గాయాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదమని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మలక్ పెట్ యశోద ఆసుపత్రి బృందం అత్యవసర మెదడు శస్త్రచికిత్సతో తలకు తీవ్రమైన గాయం అయిన 12 ఏళ్ల బాలుడికి ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ జోన్ కేంద్రంలోని ఎలైట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... హైదరాబాద్ లో ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి శంషాబాద్ కి చెందిన ఓ బాలుడు గత కొన్ని రోజుల క్రితం మెట్ల మీదినుండి జారి పడిపోవడంతో తీవ్రమై ట్రామాటిక్ బ్రెయిస్ ఇంజరీకి గురైయ్యాడు. సమయానికి న్యూరోసర్జికల్ జోక్యం,ఆధునిక న్యూరో క్రిటికల్ కేర్ ద్వారా వైద్యులు బాలుడిని రక్షించారని తెలిపారు. పెద్ద ఎపిడ్యూరల్ హీమరేజ్, తల ఎముక విరుగుడు కారణంగా జరిగే తలకు గాయాలు మెదడులో ఒత్తిడి పెరగడం, మెదడు నలిగిపోవడం వల్ల చాలా త్వరగా ప్రాణాపాయ స్థితికి దారితీస్తాయి అని చెప్పారు.ఇటువంటి పరిస్థితుల్లో శాశ్వత నరాల నష్టం నివారించేందుకు తక్షణ నిర్ధారణ, అత్యవసర శస్త్రచికిత్స మరియు గాఢ న్యూరో క్రిటికల్ కేర్ అవసరం అవుతుందని చెప్పారు.. వైద్యులు చేసిన సమగ్ర పరీక్షల్లో ఎడమ టెంపరల్ ప్రాంతంలో పెద్ద ఎపిడ్యూరల్ హీమరేజ్ ఉండి, మెదడు మధ్యరేఖ తారుమారైనట్లు గుర్తించారు. పరిస్థితి ప్రాణాపాయంగా మారే అవకాశం ఉండటంతో న్యూరోసర్జరీ బృందం అత్యవసర క్రానియోటమీ చేసి రక్త గడ్డను విజయవంతంగా తొలగించి బాలుడి పరిస్థితిని స్థిరపరిచిందని చెప్పారు. బాలుడు దాదాపుగా స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. పరీక్షలో ఎడమ పారియేటల్ ప్రాంతంలో వాపు కనిపించడంతో పాటు ఎడమ కంటిలో ఆర్బిటల్ హీమటోమా ఉన్నట్టు గుర్తించారు. పై కంటి పాప పడిపోవడం , కంటి కదలికలు పరిమితంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే న్యూరోలాజికల్ పరీక్షలు , రేడియాలజీ పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్లో ఎడమ టెంపరల్ ప్రాంతంలో గరిష్టంగా 24 మిల్లీమీటర్ల మందంతో పెద్ద ఎపిడ్యూరల్ హీమరేజ్ ఉండటం, ఎడమ టెంపరల్ ఎముక విరగడం,మెదడు మధ్యరేఖ కుడి వైపు 7 మిల్లీమీటర్ల మేరకు మారినట్లు గుర్తించారు. డాక్టర్లు పరీక్షలు చేస్తుండగానే బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు. అతని న్యూరోలాజికల్ పరిస్థితి క్షీణించే ప్రమాదం ఉండటంతో అత్యవసర శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. సాధారణ అనస్థీషియాలో అత్యవసరంగా ఎడమ ఫ్రాంటో-టెంవీరో-పారియేటల్ క్రానియోటమీ చేసి ఎడమ టెంపరల్ ఎపిడ్యూరల్ హీమటోమాను తొలగించారు. అలాగే రక్తస్రావం అవుతున్న రక్తనాళాన్ని సరిచేసి రక్తస్రావాన్ని ఆపారు. అనంతరం తల ఎముకను టైటానియం ప్లేట్లు, స్క్రూలతో తిరిగి అమర్చారు. ఈ శస్త్రచికిత్సను, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ అనస్థీషియా బృందంతో కలిసి నిర్వహించానని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని న్యూరో ఐసీయూకి తరలించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.శస్త్రచికిత్స తర్వాత బాలుడికి వెంటిలేటర్ సహాయం అందించారు. న్యూరో ఐసీయూలో నిశితంగా పర్యవేక్షించారు. మొదటి శస్త్రచికిత్స అనంతర రోజున విజయవంతంగా వెంటిలేటర్ తొలగించారు, క్రమంగా న్యూరోలాజికల్ పరిస్థితి మెరుగుపడింది.



