హామీలు అమలు చేయాలి 

హామీలు అమలు చేయాలి 

 విశ్వంభర, అనంతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు  ఇచ్చిన హామీలను, ఆరు గ్యారెంటీలను వెంటనే  అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ అనంతగిరి మండల నాయకులు  తహశీల్దార్ హిమబిందుకు మెమోరాండం సమర్పించారు. బిజెపి పార్టీ  ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల అధ్యక్షుడు చింతకుంట్ల సతీశ్ తెలిపారు. హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీని మూలంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యారెంటీలను త్వరగా అమలు చేయకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లెబోయిన వెంకటేష్ బాబు, వంగవీటి శ్రీనివాసరావు, యడ్లపల్లి వెంకట నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags: