పారిశుద్ధ్య కార్మికులతో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి హోలీ సంబరాలు
On
విశ్వంభర, నల్లగొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు హోలీ వేడుకల సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.మంగళవారం పారిశుధ్య కార్మికులంతా తమ విధులు నిర్వహిస్తూ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డికి హోలీ శుభాకాంక్షలు తెలిపి రంగులు పూశారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులందరికీ మేయర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా వివిధ ఉద్యోగ సంఘాలు, పిఆర్ టియు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ డివిజన్ల ప్రజలు మేయర్ దంపతులను కలిసి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ రంగుల హోలీ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు.హోలీ సంబరాలను ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.



