ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం

విశ్వంభర, హైదరాబాదు : సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. కేంద్ర నిధుల వినియోగంపై స్పష్టత లేదు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లంపల్లి ఇంద్రాసేన రెడ్డి విమర్శించారు. హిమాయత్‌నగర్ బాగ్‌లింగంపల్లి మండల కార్యాలయం వద్ద హిమాయత్ నగర్ బిజెపి డివిజన్ అధ్యక్షురాలు  గూడెపు మాధవి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని, ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త ప్రాజెక్టులు ప్రకటించడం సరైంది కాదని పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత లోపించిందని అన్నారు. అనంతరం మండల కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పందిర్ల ప్రసాద్, కేశబోయిన శ్రీధర్, నర్సింగ్ గౌడ్, సత్యనారాయణ, సుధాకర్, అభిషేక్, భాను ప్రకాష్, అనిల్ ముదిరాజ్, వాణిశ్రీ, నాగమణి, వాణి ముదిరాజ్, రాజు గౌడ్, కార్తీక్ ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, రాజేష్, మురళీకృష్ణ, తుల్జా తదితరులు పాల్గొన్నారు.

Tags: