మూసి ప్రక్షాళన చేయాలి

మూసి ప్రక్షాళన చేయాలి

విశ్వంభర, హైదరాబాదు : గత 12 ఏళ్లుగా మూసి నదిలో అభివృద్ధి జరగలేదు, మురుగు కాలుష్యం తగ్గకపోగా మరింత పెరిగింది, వెంటనే ప్రక్షాళన చేపట్టి, బఫర్ జోన్ పేరుతో ఇళ్ల తొలగింపులు ఆపాలి అని హైదరాబాద్ సిటిజన్ ఫోరం, అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం ప్రతినిధులు డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి లోని హెచ్‌సిఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశాలను వెల్లడించారు. మూసి అభివృద్ధి పేరుతో కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించలేదని తెలిపారు. పలు సంవత్సరాల్లో నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. మూసి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ పేరుతో భారీగా ఇళ్ల తొలగింపులు చేయడం అన్యాయమన్నారు. నది ప్రవాహానికి ఆటంకంగా ఉన్న ఇళ్లను మాత్రమే తొలగించి, బాధితులకు ప్రత్యామ్నాయ నివాసాలు కల్పించాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. మునుపటి ప్రణాళికల్లో ఇళ్ల తొలగింపుకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. మూసి పరిసర బస్తీలు, కాలనీల ప్రజలతో చర్చించి ప్రణాళికలో మార్పులు చేసి అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో యుడిఎఫ్ కన్వీనర్ ఎం. శ్రీనివాస్, హెచ్‌సిఎఫ్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి వీరయ్య, ఉపాధ్యక్షుడు పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags: