వైభవంగా శ్రీ హేమాద్రి వేంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ

వైభవంగా శ్రీ హేమాద్రి వేంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ

విశ్వంభర,  కీసర: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలోని వేంకులోని గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ హేమాద్రి వేంకటేశ్వర స్వామి పల్లకి సేవతో గిరిప్రదక్షిణ, లక్ష్మీ పూజ మంగళవారం తెల్లవారు జామున భక్త జనసందోహం మధ్య వైభవంగా జరిగింది.  కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ఆలయ అభివృద్ధికి రూ.11 లక్షలు విరాళంగా ప్రకటించారు.  సాయి దత్త పీఠాధిపతులు రామానంద ప్రభూజీ, కీసర సీఐ ఆంజనేయులు, ఆలయ ఛైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Tags: