మెగా పశువైద్య శిబిరం

మెగా పశువైద్య శిబిరం

విశ్వంభర,  గుండాల: గుండాల మండలంలో తుర్కల షాపురం గ్రామంలో పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో 284 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు, 48 పశువులకి గర్భకోశ వ్యాధి పరీక్షలు నిర్వహించి మందులని అందజేశారు. ఈ  కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డా యాకుబ్ మాట్లాడుతూ, పశువులలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండి పశువులకు ఈ ఉచిత వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  కునగల్ల లిల్లీ గణేష్, ఉపసర్పంచ్ పురుగుల సరిత, మచ్చగిరి గోపాలమిత్ర సూపర్ వైజర్ భానుచందర్, వెటర్నరీ అసిస్టెంట్ రాజు ,గోపాలమిత్రలు వంగూరి గోవింద్, కృష్ణ,శేఖర్, శ్రీను, నరేశ్ వార్డు సభ్యులు నర్సయ్య గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Tags: