27న సీతారాముల శోభాయాత్ర 

27న సీతారాముల శోభాయాత్ర 

విశ్వంభర, అంబర్ పేట : శ్రీరామ నవమి ఉత్సవ సమితి అంబర్ పేట నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈనెల 27న జరగనున్న శ్రీ సీతారాముల శోభాయాత్ర విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, శోభాయాత్ర కన్వీనర్ డాక్టర్ ఎన్.గౌతంరావు పిలుపునిచ్చారు. మంగళవారం సుందర్ నగర్, భావసార్ క్షత్రియ భవన్‌లో సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించిన ఆయన, శోభాయాత్ర అంబర్ పేట మున్సిపల్ మైదానం నుంచి మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమై కాచిగూడ చౌరస్తా వీరసావర్కర్ విగ్రహం వరకు సాగుతుందని తెలిపారు. హిందూ బంధువులు, యువకులు, పార్టీలకతీతంగా పాల్గొని శ్రీసీతారాముల కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కేసరి నర్సింగ్ యాదవ్, డిఆర్ఎస్ నరేంద్ర ఆచారి, ఎస్.శ్రీధర్ గౌడ్, మూల రవీందర్, మల్లికార్జున్, రవి, అజయ్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

Tags: