ఎమ్మెల్యే సామేల్ పై చర్యలు తీసుకోవాలి
On
విశ్వంభర, హైదరాబాదు : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు విహెచ్‌పీ ప్రతినిధులు తెలంగాణ డిజిపికి వినతిపత్రం సమర్పించారు. బాలస్వామి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచేలా, కులాల మధ్య విభేదాలు రగిలించేలా ఉన్నాయని ఆక్షేపించారు. సంబంధిత అంశాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సభ్యత్వం రద్దు ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. చర్యలు లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మోహన్ రావు, హరికిషన్ శర్మ, అనిల్, ధీరజ్, రంగనాథ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.



