గ్రామాభివృద్ధికి నిధులు

గ్రామాభివృద్ధికి నిధులు

విశ్వంభర, సిద్దిపేట: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60లక్షల నిధులు మంజూరు చేసిందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలంలోని బచ్చాయిపల్లి, సీతారాంపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను గ్రామ నాయకులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజల మాట్లాడుతూ, మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బచ్చాయిపల్లి నూతన గ్రామ పంచాయతీ భవనానికి రూ.20లక్షలు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.30లక్షలు, సీతారాంపల్లి సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10లక్షల నిధులతో నిర్మాణాలకు భూమి పూజ చేసినట్టు చెప్పారు. భవిష్యత్‌లో గ్రామాల మౌలిక వసతులకు మరిన్ని నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం ప్రేమలత యాదగిరి, ఉప సర్పంచ్ అనుపమ, మండల నాయకుడు గుర్రం అంజిరెడ్డి, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి శివకుమార్, దేవిరెడ్డి రాజారెడ్డి, బాబురెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు రాజ బహదూర్ రెడ్డి, అరవింద్ తదితరుల పాల్గొన్నారు.

Tags: