గీతంకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు అవార్డు
On
విశ్వంభర, సంగారెడ్డి: ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు చేపట్టిన కార్యక్రమాలకు హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఉదారమైన విరాళాలు, స్థిరమైన మద్దతుకు గుర్తింపుగా మంగళవారం ఒక జ్జాపికను, అవార్డును అందజేశారు. ఈ పురస్కారాన్ని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మకు అందజేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత నాలుగేళ్లగా గీతంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను చురుకుగా నిర్వహిస్తున్నారు. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, గీతం డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు తదితరులు ఈ అవార్డును అందుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు.



