పంచాయతీ కార్మికుల మహాధర్నా
విశ్వంభర, ముషీరాబాదు : తెలంగాణలో పంచాయతీ కార్మికులు వారి వేతనాలు, ఉద్యోగ భద్రత, పని విధానాల డిమాండ్ల పై హైదరాబాదు ఇందిరాపార్క్‌లో మహాధర్నా నిర్వహించారు.వేలాది మంది కార్మికులు మహాదర్నాకు తరలివచ్చారు, యూనియన్ వచ్చే మార్చి 18, 19 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. కార్మికులు వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం, మార్చి 2న జారీ అయిన ఉత్తర్వులను రద్దు చేయడం, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించడం, అలాగే బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయడం, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించడం అవసరమని డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ నుండి అసెంబ్లీ వైపు మహాదర్నాకు బయల్దేరిన సమయంలో పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. ఈ ఘటనలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పైళ్ళ గణవతి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్, చాగంటి వెంకటయ్య, పొట్టా యాదమ్మ, వంగూరు రాములు, ఎస్వీ, రమ, కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్ అరెస్ట్ అయ్యారు. నేతలు మీడియాతో మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్చి 18, 19 తేదీలలో అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని యూనియన్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పైళ్ళ గణవతి రెడ్డి, పాలడుగు సుధాకర్, చాగంటి వెంకటయ్య, పొట్టా యాదమ్మ, వంగూరు రాములు, ఎస్వీ, రమ, కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్, వివిధ జిల్లాల గ్రామ పంచాయతీ నాయకులు పాల్గొన్నారు.



