తాటి చెట్ల నరకివేత 

తాటి చెట్ల నరకివేత 

విశ్వంభర, సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాటి చెట్లను తొలగించడం అన్యాయమని బీఆర్ఎస్ నంగునూరు మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్, సహకార సంఘం మాజీ ఛైర్మన్ కోల రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులతో కలిసి తాటి చెట్ల తొలగింపును అడ్డుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,  మండలంలోని నర్మెట్ట గ్రామంలో ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సీఎం వస్తున్న సందర్భంగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లను కొట్టి గీత కార్మికుల పొట్ట కొట్టడం సబబు కాదన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశించారని తెలిపారు. హెలిప్యాడ్ కోసం తాటి చెట్లను నరకడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో సుమారుగా 60మంది కార్మికులు తాటి చెట్లపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వేరే ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పుప్పాల నారాయణ, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, గీత కార్మిక సహకార సంఘం నాయకులు, యాదగిరి గౌడ్, రాములు గౌడ్, శేఖర్ గౌడ్, సురేష్ గౌడ్, నాయకులు సతీష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్, చింటూ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: