రైతుభరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి 

రైతుభరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి 

విశ్వంభర, చింతపల్లి: కొత్తగా పట్టాదార్ పాసుబుక్  పొందిన రైతులు వెంటనే  సంబందిత క్లస్టర్ ఏఈఓ ను  కలిసి రైతుభరోసా పధకానికి అప్లికేషన్ ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి శ్రావణ కుమారి తెలిపారు. ఇంతకు ముందు రైతుభరోసా పధకం అర్హత ఉన్న రైతులు బ్యాంకు అకౌంట్ నెంబర్ చేంజ్ గురించి  ఏఈఓ లకు అప్లికేషన్ ఇవ్వాలని చెప్పారు. ఏటీఎంఏ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వారి సహకారంతో మంగళవారం చింతపల్లి రైతు వేదికలో రైతులకి న్యాచురల్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు.  ఈ ట్రైనింగ్ కు కె.వి.కె కంపాసాగర్  సైంటిస్ట్ రాములమ్మ ముఖ్య అతిధిగా విచ్చేసారు. రైతులకు నాచురల్ ఫార్మింగ్ ఆవశ్యకత, ఉపయోగించే జీవన ఎరువులు, కషాయాలు తయారుచేసే విధానం వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటీఎం దేవరకొండ అపర్ణ, ఏఈఓలు,  రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags: