మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
- ప్రభుత్వ హాస్పిటల్ లలో సాధారణ ప్రసవాలు పెంచాలి
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య నిపుణలచే ప్రతి పి హెచ్ సి లో మెడికల్ క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. దీనిలో భాగంగా మంగళవారం మేళ్ల చెర్వు పి హెచ్ సి లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మెడికల్ క్యాంప్ ల ద్వారా జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, మహిళలకు గర్భశాయ ముఖ కాన్సర్ ను గుర్తించే టాప్ స్పెయర్, కంటికి సంబందించి కాంట్రాక్ట్ లోపం,బి పి షుగర్, చిన్న పిల్లలో ఎత్తు, పోషకాహార లోపాలకు చెందిన వైద్య నిపుణులు రోజుకొక్క పి హెచ్ సి కి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను ఉచితంగా అందించటం తో పాటు ఆరోగ్యం మెరుగు పడేలా పలు సూచనలు ఇస్తారని ఇంకా ఏమైనా శస్త్ర చికిత్స లు చేయాల్సివచ్చిన, మెరుగైన వైద్యం కోసం జనరల్ హాస్పిటల్ కి రిఫర్ చేయటం జరుగుతుందని అన్నారు. పిహెచ్ సి లలో సాధారణ ప్రసవాలు పెరిగేలా ప్రజలను ఆహగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం మేళ్లచెర్వు మండల కేంద్రం లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ లో కలెక్టర్ హాస్టల్ లోని గదులను వంట గదిని పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. విద్యార్థులను ప్రతి రోజు వంట బాగుంటుందా ? మెను ప్రతిరోజు అమలు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పదవతరగతి వార్షిక పరీక్షలలో ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్ట్ లో కనీసం 70 శాతానికి పైగా మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొనిరావాలని కోరారు. కలెక్టర్ వెంట డిప్యుటీ డిఎంహెచ్ఓ మాధవ్ కుమార్, డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యులు యస్వంత్, మణి, ప్రజ్ఞ, సాయి శ్రీ, వెంకటేష్, సమీర, మెడికల్ అధికారి, వైస్ ప్రిన్సిపాల్ మధు, ఇన్చార్జి తహసిల్దార్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ బచ్చు పద్మావతి, ఉప సర్పంచ్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.



