పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమం 

పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమం 

విశ్వంభర,  పటాన్‌చెరు: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రవీణ తెలిపారు.ఈ కార్యక్రమంలో సెబి స్మార్ట్ ట్రైనర్ శ్రీనివాస్ రెడ్డి మంచు ముఖ్య వక్తగా పాల్గొని విద్యార్థులు, అధ్యాపకులకు ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల ప్రాధాన్యతపై సమగ్ర అవగాహన కల్పించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా  బాంబే స్టాక్ ఎక్స్చేంజ్  నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ల పనితీరు, సెక్యూరిటీ లావాదేవీలు, వాటి వ్యాపారంపై ప్రభావం, ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే మార్పులు వంటి పలు అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రవీణ మాట్లాడుతూ, ప్రస్తుత కృత్రిమ మేధస్సు మరియు సాంకేతికత ఆధారిత ప్రపంచంలో విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఆధునిక పద్ధతులు, వినూత్న అంశాలపై పూర్తి అవగాహనతో పాటు తగిన శిక్షణ అవసరమని పేర్కొన్నారు. అందుకుగాను కళాశాలలో వివిధ స్కిల్ డెవలప్మెంట్, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఐక్యూ ఏసీ , ఎన్ఎస్ఎస్ , ఈడీసీ  కామర్స్ మరియు అర్థశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో రెండు సెషన్లలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పూనం కుమారి, ప్రొఫెసర్ ఎన్. యోగి బాబు, ప్రొఫెసర్ ఆకుల వెంకటేశం, డాక్టర్ దశమ్మ, స్వప్న, అర్చన, ఉమాదేవి తదితర అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: