అనారోగ్యంతో విలేకరి మృతి
On
విశ్వంభర, అనంతగిరి: మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన అనంతగిరి మండల ప్రజా జ్యోతి విలేకరి గొళ్ళ నరేష్ (40) తెల్లవారు జామున మృతి చెందారు. దీర్ఘకాలంగా విలేకరిగా పనిచేస్తున్న ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు పలువురు రిపోర్టర్లు నరేష్ మృత దేహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నరేష్ పేదల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారన్నారు.



