శాలిబండలో బీజేపీ నిరసన
విశ్వంభర, బహుదూర్ పుర : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు భారతీయ జనతా పార్టీ శాలిబండ డివిజన్ ప్రెసిడెంట్ సాయినాథ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బండ్లగూడ మండల తహసిల్దారు కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా డివిజన్ ప్రెసిడెంట్ సాయినాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ గ్యారంటీల గారడీ ఆరు అబద్ధాలు 66 మోసాలని, కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలన వైఫల్యాల ను ఎండగడుతూ ప్రజా పాలన కుంటుపడిందని కాంగ్రెస్ పాలనలో కమీషన్లకు నిలయంగా మారిందని గ్యారెంటీలను మరచి జేబులు నింపుకోవడమే పనితనంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బహుదూర్పుర ఇంచార్జ్ బిజెపి వై నరేష్, హైదరాబాద్ పార్లమెంటు జాయింట్ కన్వీనర్ కోటి ధర్మతేజ, భాగ్యనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఎడ్ల పండరినాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్న చలపతి, ఆలూరు శ్రీహరి తదితర నాయకులు పాల్గొన్నారు.



