ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
విశ్వంభర,నెల్లికుదురు: మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి యుపిఎస్ లో స్వయం పరిపాలన దినోత్సవం మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి స్టూడెంట్స్ కు బోధించారు. అనంతరం హెచ్ఎం మామిడాల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సెల్ఫ్ గవర్నమెంట్ డే ద్వారా స్వయంగా పాఠాలు బోధించడంతో గురువుల యొక్క శ్రమ, తమ పట్ల పడే తపన తెలిసిందని దీంతో టీచర్లపై మరింత గౌరవం, భక్తి భావం పెరిగిందని స్వయంపాలన ఉపాధ్యాయులు చెప్పారు. హెచ్ ఎమ్ వెంకటేష్ మాట్లాడుతూ బాలబాలికల్లో నాయకత్వ లక్షణాలు, వృత్తి పట్ల గౌరవం,విశ్వాసం పెంపొందించేందుకు సెల్ఫ్ గవర్నమెంట్ డే దోహదపడుతుందన్నారు.హెచ్ఎం గా చక్రధర్, డీఈవో రహమాన్ పాషా,ఎం ఈవోగా రీతిక మరో 16 మంది ఉపాధ్యాయులుగా వ్యవహరించారు . కార్యక్రమంలో ఎఎపిసి ఛైర్మెన్ తాళ్ళ సునీత, ఉపాధ్యాయులు శ్రీ సాయి ప్రసాద్, అశోక్,యాకూబ్ రెడ్డి,అనిల్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.



