పీస్ కమిటీ సమావేశం

పీస్ కమిటీ సమావేశం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో మంగళవారం యదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఆదేశానుసారం రంజాన్ పండుగ సందర్బంగా మండల పోలీసు స్టేషన్లో పీస్ కమిటి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల ఎస్సై డి.నాగరాజు మాట్లాడుతూ, రంజాన్ పండుగను స్నేహభావంతో, కులమత భేదం లేకుండా జరుపుకోవాలని, ఎటువంటి అవాంచ్హనీయ సంఘటనలు జరగకుండా పండుగను చేసుకోవాలని కమిటి సభ్యలను కోరారు. అదేవిదంగా రంజాన్ పండుగ తరువాత వచ్చే ఉగాది, శ్రీరామనవమి పండుగలను కూడా కులాలకు అతీతంగా అందరు కలిసి జరుపుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప-సర్పంచ్ రమేష్, ఇతర నాయకులు ఎండి.అన్వర్, ఇతర సభ్యులు, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: