అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
On
విశ్వంభర, వినాయక నగర్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ కాయిల్స్ టార్గెట్ గా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో రోడ్ల పై ఉండే ఆవులను, వాహనాలను దొంగిలించి జైలుకు వెళ్లిన పాత నేరస్తులు జైల్లో తమకు పరిచయమైన ఇతర నిందితులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో వరుసగా ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ వైర్లను దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న ముఠాను పట్టుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.



