ఘనంగా ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణం
On
విశ్వంభర,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు వివిధ గ్రామాలలో ఉగాది పండుగ సమీపిస్తున్న తరుణంలో గత కొన్ని రోజులుగా ఎల్లమ్మ జమదగ్ని, మల్లమ్మ కేతమ్మ ల కళ్యాణాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో జర్నలిస్టు బొలగాని యాకన్న, సుమలత దంపతుల గృహంలో మంగళవారం ఎల్లమ్మ జమదగ్ని, కేతమ్మ మల్లన్న దేవతామూర్తుల పరిణయం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం జోల పాటలు పాడుతూ పవళింపు సేవ చేశారు. ఒగ్గు కథకులు ఎల్లమ్మ తల్లి జమదగ్ని ల పావన చరిత్రను కళ్ళకు కట్టినట్లు చెప్పగా భక్తులు శ్రద్ధగా వింటూ తరించారు.



