హాస్పిటల్ ను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

హాస్పిటల్ ను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని విజయ లక్ష్మి హాస్పిటల్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆసుపత్రి  సంబంధిత వైద్యుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ నిమిత్తం ఈ తనిఖీ చేపట్టారు. అయితే, తనిఖీకి వెళ్లిన సమయంలో ఆసుపత్రి మూసివేసి ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా అక్కడ సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ, ఆసుపత్రుల నిర్వహణలో నిర్లక్ష్యం, నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అస్సలు సహించబడదని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఆసుపత్రి యాజమాన్యం మరియు సిబ్బందిపై ఉందని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి, తదుపరి చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: