బొజ్జగూడెంలో పశువైద్య శిబిరం
On
విశ్వంభర, అనంతగిరి: అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో జిల్లా పశుగణనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గుగులోతు నీలబాయి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు తమ పశువులకు సీజన్ వారీగా టీకాలు వేయించాలన్నారు. డాక్టర్ సురేంద్ర మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యానికి ప్రభుత్వం అందిస్తున్న మందులను, టీకాలను రైతులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్యా నాగమణి రవి, గ్రామ పెద్దలు, సూపర్ వైజర్ సైదులు, ఎల్ ఎస్ ఏ శరత్, గోపాల మిత్రులు నజీర్, రవీందర్,గోపాల్ రావు, సరిత, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



