అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
విశ్వంభర,ఇనుగుర్తి: సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సర్పంచి చెడుపాక సుజాత అన్నారు.ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో ఈజీఎస్ నిధుల ద్వారా రూ.15 లక్షలతో సిసి రోడ్లు నిర్మాణ పనులను సర్పంచి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో విభేదాలకు తావు లేదన్నారు. కాంగ్రెస్ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ బైరు అశోక్ గౌడ్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నిధులు విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే మురళి నాయక్ తెలిపినట్లు చెప్పారు. గ్రామాన్ని అన్ని విధాలుగా ఐకమత్యంతో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్ చారి,జి పి కార్యదర్శి గండు అనిల్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు, మునిగంటి సరిత,నిడిగంటి చంద్రమౌళి, ఎలుగలబోయిన శ్రీనివాస్ యాదవ్, బైరు వినయ్ గౌడ్,ముత్యాల సోమక్క,చెడుపాక సురేష్,నాయకులు చెడుపాక యాకయ్య,బైరు వెంకటయ్య బైరు శ్రీనివాస్, మునిగంటి రాజు చారి,గుండాల ధర్మయ్య,దాసరి ప్రకాష్,బత్తిని యాదగిరి,బైరు పటేల్ రవి, చెడుపాక వెంకన్న,మరద హరికృష్ణ,ముత్యాల వెంకన్న, చెడుపాక దర్గయ్య,ప్రగతి వెంకన్న,శేఖర్,భోజ్య నాయక్,బత్తిని రాములు,నాయిని కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.



