చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం
On
విశ్వంభర, ముషీరాబాద్: ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలంటూ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. సోమవారం హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, న్యూఢిల్లీ భారత ప్రభుత్వ సౌజన్యంతో నిర్వహించిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను శైలజా రామయ్యర్ ప్రారంభించారు. ఈ ప్రదర్శన మార్చి 2 నుండి 15 వరకు కొనసాగనుంది. ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల వైవిధ్యభరిత చేనేత వస్త్రాలు ప్రదర్శించబడ్డాయి. అదేవిధంగా, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల ప్రత్యేక సంపద వస్త్రాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.



