మహేశ్వరంలో  ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం 

మహేశ్వరంలో  ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం 

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండల కేంద్రంలో  మండల పరిషత్ అభివృద్ధి అధికారి శైలజ రెడ్డి  తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశాలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన అభ్యర్థులు మాట్లాడుతూ,  నిరుపేదలైన మమ్మల్ని గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు  కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి,  నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల గృహ నిర్మాణ ఏఈ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఏఈ చైతన్య,మహేశ్వరం  గ్రామపంచాయతీ  కార్యదర్శి సుజాత, గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్, మహేశ్వరం గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారుగళ్ల లాజర్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్  కాకి పరమేష్ ముదిరాజ్, స్వర్ణ గంటి సంజీవ, కడేమోని ప్రభాకర్, ఆకుల వీరు బాబు, ఆవుల కాడి శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుట్లగారి చందు, గ్రామ యువకులు బొమ్మనమైన మహేష్ బాబు, గ్రామపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ రాజు నాయక్, సిబ్బంది దానప్ప గారి లక్ష్మణ్. పేయ్యాల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags: