రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

విశ్వంభర, రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026ను యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో గత వారం రోజుల నుండి రామన్నపేట సి.ఐ, ఎస్సై ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు, ట్రాక్టర్ డ్రైవర్లకు, రామన్నపేటలోని ట్రావెల్స్ యజమానులకు, రామన్నపేటలో రోడ్ సేఫ్టీ గురించి అవగాహనా కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ అవగాహనా కార్యక్రమంలో ప్రజలు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలని, తప్పకుండ హెల్మెట్ దరించి ఉండాలని, అదే విదంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్ తప్పకుండ ఉండాలని ప్రజలకు తెలియజేసినారు, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం త్రాగి వాహనాలను నడపడం ప్రాణాంతకం అని ప్రజలకు తెలియజేసినారు, మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని, ఏవరైనా ఇచ్చినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తిసుకోనబడునని, రోడ్డు ప్రమాదం వలన ఎంతో మంది వికలాంగులుగా మారుతున్నారని మరెందరో ప్రాణాలు కోల్పోయారని తెలియజేసినారు.

Tags: