తొర్రూరు ఫోటో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుని సన్మానించిన పాండు
On
- ప్రజలకు న్యాయ సేవలు అందించాలి
విశ్వంభర , తొర్రూరు: ప్రజలకు న్యాయవాదులు న్యాయ సేవలు అందించాలని దళిత రత్న అవార్డు గ్రహీత, బేడ బుడగ జంగాల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తూర్పాటి పాండు అన్నారు. గురువారం నూతనంగా ఎన్నికైన బార్ అధ్యక్షులు వీరదాసు వెంకటరత్నం, ఉపాధ్యక్షుడు డి. నాగేశ్వర్, ప్రధాన కార్యదర్శి టి. సైదులు, సంయుక్త కార్యదర్శి పల్లవి, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ ఎం. ఎల్లేష్, కోశాధికారి కృపావతి, సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా తూర్పాటి పాండు మాట్లాడుతూ, న్యాయవాదులు వివిధ కేసులలో ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేందుకు కృషి చేయాలని కోరారు. నూతనంగా ఎన్నికైన బార్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు



