రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి
- ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. రంజాన్ నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఈనెల 21న జరిగే రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. రంజాన్ పండుగను సూర్యాపేట నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఐకమత్యానికి ప్రతీక అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉందని, పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని, ముస్లింలందరూ రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత నిష్టతో అల్లాను ప్రార్థిస్తారని తెలిపారు. ఆత్మీయతకు మారుపేరైన రంజాన్ ప్రజలందరికీ సుఖసంతో షాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.సూర్యాపేట నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.



