ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు 

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు 


విశ్వంభర, బాగ్ లింగంపల్లి: హనుమాన్ జయంతి సందర్భంగా లింగంపల్లిలో కాంగ్రెస్ సికింద్రాబాద్ డీసీసీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ అరవింద్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాన్ని నవీన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, శివ కుమార్, ఉపేందర్, బబ్లూ, రవి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: