ఠాకూర్ అనుకుల్ చంద్ర బోధనలు ఆచరణీయం
- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డిజిల్లా పటాన్ చేరు నియోజకవర్గం బొల్లారం శ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్ర బోధనలు ఆచరణీయమని.. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం డివిజన్ పరిధిలోని బతుకమ్మ ఘాట్ లో ఏర్పాటు చేసిన శ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్ర జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ శతాబ్దంలో సత్సంగ్ ఆశ్రమాన్ని నెలకొల్పి ప్రజలకు ప్రత్యేక దైవారాధన, సేవా, క్రమశిక్షణ అంశాలపై బోధనలు చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా తన ఆశ్రమాలను నెలకొల్పి ప్రజలలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించారని తెలిపారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీఐ రవీందర్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



