పెద్దతండాలో ఫాగింగ్
On
విశ్వంభర,ఇనుగుర్తి: మండలంలోని పెద్దతండ(సీఎం) గ్రామపంచాయతీతోపాటు పరిధిలోని తండాలలో దోమల నివారణ కోసం సర్పంచి రేణుక నరేష్ ఆదివారం వార్డు సభ్యులతో కలిసి ఫాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ దోమల బెడద ఎక్కువగా ఉండటంతో ప్రజలు,పశువులు, మేకలు, గొర్రెలు అవస్థ పడుతున్నాయని , వాటి నివారణకు ఫాగింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మురుగు కాలువల్లో,చెట్లపొదల్లో,వీధుల వెంట, పెంటకుప్పల్లో గ్రామపంచాయతీ సిబ్బంది యంత్రంతో దోమల మందు పిచికారి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నాయకులు జరుపుల బిక్షం,తేజావత్తు సంతోష్,బాలు భూక్యా నరహరి,లచ్చిరాం,శంకర్,వీరన్న కారోబార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



