మండలంలో కేఎల్ఆర్ పర్యటన
On
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలంలో వివిధ గ్రామాలలో మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు. అమీర్పేట్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుభాన్ పూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ ఉప సర్పంచ్ కుమార్ను పరామర్శించారు. దుబ్బచర్లలో గ్రామంలో గ్రామ సర్పంచ్ సిల్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా గుడి నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్స్, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,



