ఫస్ట్ క్రై స్కూల్ వార్షికోత్సవం

ఫస్ట్ క్రై స్కూల్ వార్షికోత్సవం

విశ్వంభర, బాగ్ లింగంపల్లి : హిమాయత్ నగర్‌లోని ఫస్ట్ క్రై ఇంటెల్లిటోట్స్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ సెంటర్ మూడో వార్షికోత్సవం ఆదివారం ఉదయం హైదరాబాద్  బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అశోక్ కుమార్, బిజినెస్ పార్ట్నర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి అశోక్ కుమార్ మాట్లాడుతూ, పిల్లల మొదటి అడుగు విద్యలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలో కూడా బలంగా ఉండాలని అన్నారు. చిన్న వయసులోనే మంచి విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించాలని పేర్కొన్నారు. మా పాఠశాలలో ఆటపాటలతో కూడిన పాఠ్యబోధన ద్వారా పిల్లల్లో దాగివున్న  సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామన్నారు.అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు.

Tags: