ఘనంగా పాఠశాల వార్షికోత్సవం
On
విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా భారతి నగర్ డివిజన్‌లోని విజయ ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల 22వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విద్యతోపాటు సంస్కారం, క్రమశిక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రిన్సిపల్ విజయ శ్రీ, చెరుకుపల్లి రాధాకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎల్‌ఐజీ కాలనీ సొసైటీ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, డైరెక్టర్ సామ్యుల్ జాన్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.



