స్పోర్ట్స్ కిట్ల పంపిణీ

స్పోర్ట్స్ కిట్ల పంపిణీ

విశ్వంభర, మహబూబాబాద్:  మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పనిచేస్తోందని, అందులో భాగంగానే క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేస్తున్నామని  మహబూబాబాద్ జిల్లా క్రీడా, యువజన సంక్షేమ అధికారి శ్రీమతి జ్యోతి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న అథ్లెటిక్స్ క్రీడాకారులకు సోమవారం ప్రత్యేక స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  మహబూబాబాద్ జిల్లా క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి సహకారంతో క్రీడా సామాగ్రి అందజేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా సీఎం కప్ స్పెషల్ ఆఫీసర్ నందకిషోర్ గోకుల్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోని  క్రీడాకారులను  ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవిలువిశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ జిల్లా యువజన సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: