మున్నూరుకాపు ప్రజాప్రతినిధులకు సన్మానం

మున్నూరుకాపు ప్రజాప్రతినిధులకు సన్మానం

విశ్వంభర,కేసముద్రం: మున్నూరుకాపులు రాజకీయాల్లో రాణించాలని మండల మున్నూరుకాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు చందా గోపి అన్నారు. ఆదివారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం ఎం.కె.కన్వన్షన్ లో ఆ సంఘ 23 వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇటీవల కేసముద్రం మండల పరిధిలోని స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించిన ప్రజాప్రతినిధులను సంఘ బాధ్యులంతా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చందా గోపి మాట్లాడుతూ,  మండల వ్యాప్తంగా మున్నూరుకాపులు రాజకీయాల్లో రాణించాలని, ఆ మేరకు మనమంతా వారికి  అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక, పురపాలక ఎన్నికల్లో విజయం సాధించిన కేసముద్రం మున్సిపాలిటీ 11వార్డు కౌన్సిలర్ ఆగెరాము, అయ్యగారిపల్లి సర్పంచ్ మలిశెట్టి శోభన్, ఉపసర్పంచ్ కొంతం జ్యోతి వెంకన్న, చిన్నముప్పారం సర్పంచ్ రాయిలి భవాని శేఖర్, తాళ్లపూసపల్లి ఉపసర్పంచ్ బండారు దేవేంద్ర, అన్నారం గ్రామ సర్పంచ్ బండి పృధ్వీరాజ్ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కముటం స్వామి, కోశాధికారి సింగంశెట్టి ఏకాంతం, వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల సుధాకర్, గౌరవ సలహాదారులు తుంపిళ్ల శ్రీనివాస్, దామరకొండ ప్రవీణ్ కుమార్, గుంజపొడుగు కొమ్మాలు, గనె యాదగిరి, మున్నూరుకాపు కులసంఘం అధ్యక్షులు కముటం శ్రీనివాస్, సాంకేతిక విభాగం అధ్యక్షులు పిన్ని రాము, ఉపాధ్యక్షులు పాల శ్రీనివాస్, సుందర్ వెంకన్న,  నూకల వెంకటేశ్వర్లు, కముటం పెద్దస్వామి, సహాయ కార్యదర్శులు లక్కాకుల సత్యనారాయణ, మామిడి శోభన్ బాబు, కముటం శ్రీధర్, ప్రచార కార్యదర్శులు తోట నాగయ్య, ఆరుద్రపు శ్రీనివాస్, గుంజపొడుగు శ్రీనివాస్, దలువాయి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొంతం శ్రీను, రావుల వెంకటేశ్వర్లు, గుండు దామోదర్,  తదితరులు పాల్గొన్నారు.

Tags: