ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ 

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ 

విశ్వంభర,నెల్లికుదురు: తెలంగాణ ప్రాంతంలోని ప్రజలపై దౌర్జన్యకాండ,మారణ హోమం సృష్టించి ధన,మాన, ప్రాణాలను దోచి పాలన కొనసాగించిన ఖాసింఖాన్ ను చంపి గోల్కొండకు తొలి హిందూ స్వదేశీ రాజుగా ప్రజారంజకంగా పరిపాలించిన ప్రజాపాలకుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాలలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. స్థానిక సంఘం అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్తోపాటు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కేజీ కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి రమణ తదితరులు హాజరై పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో రమణతోపాటు పలువురు మాట్లాడుతూ ఏ మాత్రం రాజకీయ వారసత్వం లేని గౌడ కులంలో పుట్టిన పాపన్న నాడు తెలంగాణ ప్రాంతాన్ని ఏలే మొగల్ ముస్లిం రాజులు చేస్తున్న హిందూ వ్యతిరేక, దోపిడీని చిన్నతనం నుంచే ఎదిరించాలనే పట్టుదల గల గొప్ప ధైర్యశాలి అన్నారు. యువకుడిగా తమ స్నేహితులతో కలిసి భూస్వాములను దొరలను,పెత్తందారులను, తాబేదారులపై దాడులు చేసి భూములను  పేదలకు పంచిన గొప్ప వీరుడన్నారు. స్వతహాగా వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని  మొగల్ రాజులపై దండయాత్ర చేసి గోలకొండను స్వాధీనం చేసుకొని అన్ని వర్గాలకు ఆప్తుడయ్యాడని కొనియాడారు.  పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం విగ్రహ దాతలు కందిమల్ల సతీష్,నూనావత్ నరేష్ లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కేజీ కేఎస్ నాయకులు బి వెంకటేశ్వర్లు, గౌని వెంకన్న,యమగాని వెంకన్న,వీరగామి మల్లేశం, మద్దెల శోభన్ గౌడ్,దేశగాని యాకన్న గౌడ్,బొల్లెపెల్లి సతీష్ గౌడ్,గుండ గాని చిన్న వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: