సమాజంలో శాంతి నెలకొనాలి
On
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
విశ్వంభర,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని తాంబేలు గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీ జీవన జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న దేవాలయ అభివృద్ధి కోసం చిమ్ముల గోవర్ధన్ రెడ్డి రూ.1,51,000 విరాళంగా దేవాలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవానుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. మున్సిపల్ ఛైర్మన్ కుమార్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.



