ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత 

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత 

 విశ్వంభర, సూర్యాపేట: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఏఐసీసీ నాయకుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు . ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు, అలంకార్ థియేటర్ అధినేత అప్పం శ్రీనివాసరావు నివాసంలో  ఏర్పాటుచేసిన  ఉప్పలమ్మ పండుగ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు.  గ్రామ దేవతలు  ఉప్పలమ్మ, మైసమ్మ పండుగలను ఘనంగా నిర్వహించుకోవడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి, మున్సిపల్ కౌన్సిలర్ నాగుల వాసు, డీసీసీ కార్యదర్శి రుద్రంగి రవి  తదితరులు పాల్గొన్నారు.

Tags: