పేదల సొంతింటి కల సాకారం 

పేదల సొంతింటి కల సాకారం 

  • ఏఐసీసీ సభ్యుడు  రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి 

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామానికి చెందిన దుండిగల రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి  మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రతీ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని, రాబోయే ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు రాబోతున్నాయని ధీమా  వ్యక్తం చేశారు.

Tags: