23న జిల్లా కేంద్రాలలో నిరసనలు
విశ్వo భర, మహబూబాబాద్: రాష్ట్రంలో ఉన్న 12, 732 గ్రామ పంచాయతీలలో సుమారు 60 వేల మంది మల్టీపర్పస్ వర్కర్స్ వివిధ నిర్వహిస్తున్నారని, వారికి డిసెంబర్ , జనవరి నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయని, విడుదల చేయాలని ఈ నెల 23 న జిల్లా కేంద్రాలలో నిరసనలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి ఒక ప్రకటనలో కోరారు. ప్రతినెలా రూ. 60 కోట్లు కేటాయిస్తే జీతాలు ఇచ్చే అవకాశం ఉన్నా, ప్రభుత్వం నిర్లక్ష్య మూలంగా మల్టీపర్పస్ వర్కర్లు జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం అత్యంత పేద వర్గాలు పనిచేస్తున్న గ్రామపంచాయతీ వర్కర్లకు జీతాలను పెండింగ్లో పెట్టడం భావ్యం కాదని అన్నారు. వెంటనే రెండు నెలల పెండింగ్ జీవితాల్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ వర్కర్స్ జీవో 51 రద్దు చేయాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.



